భారతీయ స్టాక్ మార్కెట్కు ఈ రోజు 'బ్లాక్ ట్యూస్'గా మారింది. ఒక్కరోజులోనే భారీ స్థాయిలో అమ్మకాల ఒత్తిడి రావడంతో దలాల్ స్ట్రీట్లో తీవ్ర పతనం చోటు చేసుకుంది. సెన్సెక్స్ 1,450 పాయింట్లకుపైగా కుప్పకూలడంతో, పెట్టుబడిదారుల సంపదలో సుమారు రూ.10 లక్షల కోట్ల నష్టం జరిగింది. ఉదయం వరకు స్థిరంగా కనిపించిన మార్కెట్.. మధ్యాహ్నానికి పూర్తిగా నష్టాల్లోకి జారిపోవడం పెట్టుబడిదారుల్లో భయాందోళనలు పెంచింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.467 లక్షల కోట్ల నుంచి రూ. 456.9 లక్షల కోట్లకు పడిపోయింది.