Shot News:మహానాడును ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా సీఎం చంద్రబాబు నాయుడి వినూత్న నిర్ణయం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ అంగన్వాడి డ్వాక్రా సాధికార సంస్థ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి నవమి లాం పేర్కొన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇంధన వినియోగం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నెల 27,28 తేదీలలో మహానాడు 2026 వర్చువల్ పద్ధతిలో నిర్వహించడం గొప్ప ఆదర్శనీయం అన్నారు.

Shot News:మహానాడును ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా సీఎం చంద్రబాబు నాయుడి వినూత్న నిర్ణయం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ అంగన్వాడి డ్వాక్రా సాధికార సంస్థ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి నవమి లాం పేర్కొన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇంధన వినియోగం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నెల 27,28 తేదీలలో మహానాడు 2026 వర్చువల్ పద్ధతిలో నిర్వహించడం గొప్ప ఆదర్శనీయం అన్నారు. నెల్లూరులో జరగాల్సిన మహానాడు వలన ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి మార్చడం శుభ పరిణామం అన్నారు. దేశమే ముందు(Nation first) అనే అజెండాతో ముందుకు సాగుతున్న చంద్రబాబు నాయుడు ఈనెల 27,28 తేదీలలో "హైబ్రిడ్ విధానంలో" ఈ కార్యక్రమాన్ని నిర్వ హించడమే కాకుండా ప్రజాధనం వృధా కాకూడదని స్వయంగా తన కాన్వయిను తగ్గించుకున్న చంద్రబాబు నాయుడు మహానాడు విషయంలో తీసుకున్న ఈ నిర్ణయం ఆయన దూరదృష్టికి మరియు నిబద్ధతకు నిదర్శనం అన్నారు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడమే ధ్యేయంగా ఈ అడుగు వేయడం మన అందరికీ ఆదర్శనీయం అని అన్నారు.