తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత వేళ ఐఎండీ కూల్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాల ఎంట్రీ, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత వేళ ఐఎండీ కూల్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాల ఎంట్రీ, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికే కేరళను బలంగా తాకాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. దీని ప్రభావంతో కేరళలో వర్షాలు మొదలయ్యాయి. అక్కడి నుంచి కర్ణాటక, తమిళనాడు మీదుగా భారీ మేఘాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వైపు దూసుకొస్తున్నాయి.