దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - ఎస్‌ఐఆర్) ను విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎన్నికల ఎలక్ట్రోల్ రిజిస్టేషన్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ కోరారు.

దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - ఎస్‌ఐఆర్) ను విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎన్నికల ఎలక్ట్రోల్ రిజిస్టేషన్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ కోరారు. శుక్రవారం స్థానిక శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గ బిఎల్ఓలు, బిఎల్ఏలతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌)పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్ 164వ బూత్ ఇంచార్జ్ నవమి లాం పాల్గొన్నారు.