గుంటూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2024 జూన్ 12న నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నేటితో రెండేళ్ల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరు నగరంలోని 23వ డివిజన్ రఘురాం నగర్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు

గుంటూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2024 జూన్ 12న నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నేటితో రెండేళ్ల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరు నగరంలోని 23వ డివిజన్ రఘురాం నగర్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు, అంగన్‌వాడీ-డ్వాక్రా సాధికార సంస్థ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమిలాం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ఆయన నాయకత్వంలో మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తూ సుభిక్షంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు.
డ్వాక్రా మహిళలకు రుణ సదుపాయాలు కల్పించడమే కాకుండా, మహిళా సాధికారతకు ప్రభుత్వం విశేష ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రాజకీయాల్లో మహిళలకు ప్రత్యేక అవకాశాలు, రిజర్వేషన్లు కల్పిస్తూ గౌరవప్రదమైన స్థానం కల్పిస్తున్నారని కొనియాడారు.
ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని నవమిలాం అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సేవలందించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో 23వ డివిజన్‌కు చెందిన ప్రజలు, మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.